Thursday, November 21, 2024

గుడిసెవాసులందరికీ పట్టాలివ్వాలి : సిపిఎం కార్యదర్శి తమ్మినేని

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా, చెన్నూర్ మండలంలోని బాబూరావుపేట శివారు ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను తగలబెట్టడం , మహిళలపై దౌర్జన్యం చేసి దాడి చేయడాన్ని సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాబూరావుపేట శివారులో ఉన్న ప్రభుత్వ  అసైన్ఢ్ భూమిలో ఇళ్ళులేని నిరుపేదలు సుమారు 1600 కుటుంబాలు గుడిసెలు వేసుకుని గత కొన్ని నెలలుగా నివాసముంటున్నారన్నారు.

ఈ భూమిని మోసపూరితంగా పట్టా చేసుకున్న కబ్జాదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్ముక్కై శనివారం తమ కిరాయి గూండాలను పంపి ట్రాక్టర్లతో గుడిసెలను కూల్చి, పెట్రోల్ పోసి తగలబెట్టించారన్నారు. పేదలకున్న కొద్దిపాటి వస్తువులు, నిత్యావసర సరుకులు కూడా పూర్తిగా కాలిబూడిదయ్యాయన్నారు. అడ్డువచ్చిన వారిపై కులంపేరుతో దూషిస్తూ కర్రలతో దాడిచేసారని, ప్రాధేయపడ్డ మహిళలపై దౌర్జన్యం చేసి దాడి చేశారన్నారు. జగిత్యాల పట్టణంలో కూడా పేదలు వేసుకున్న గుడిసెలను నేలమట్టం చేసారన్నారు. ఇళ్ళు లేని పేదలకు డబుల్ బెడ్‌రూమ్‌లు కేటాయిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం …తలదాచుకునే గూడు లేక ప్రభుత్వ స్థలంలో గుడిసె వేసుకుంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్ముక్కై వాటిని కూల్చివేయటం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఘటనకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పేదలకు, వారి గుడిసెలకు రక్షణ కల్పించాలని సిపిఐ(ఎం) డిమాండ్ చేస్తోందని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News