Wednesday, January 22, 2025

అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలి

- Advertisement -
- Advertisement -

దుమ్ముగూడెం : అర్హులైన పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలాలు మంజూరు చేయాలని, సాగులో ఉన్న ప్రతీ ఒక్క ఆదివాసికి పోడు పట్టాలివ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం మండలంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ములకపాడు సెంటర్ నుంచి రెవిన్యూ కార్యాలయం వరకు భారీ ప్రదర్శనతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగిలిన వారికి పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. అర్హులైన పేదలకు గృహలక్ష్మీ పథకం ద్వారా ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ఇంటి స్థలాలు లేని పేదలకు ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. వలస ఆదివాసీలు గుత్తికోయ కాదు, ఎస్టీ కోయగా గురితంచాలని ప్రభుత్వం కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించారు.

అనంతరం తహసీల్ధార్ మణిధర్, ఎంపిడివో, ముత్యాలరావులకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన అధికారులు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు యలమంచి శ్రీనుబాబు, మర సమ్మక్క, సర్పంచులు మిడియం జయ, కల్లూరి దేవి, టి. తిరుపతిరావు, ఉప సర్పంచ్‌లు వాగే ఖాదర్‌బాబు, బొల్లి సత్యనారాయణ, గుడ్ల రామ్మోహన్ రెడ్డి, సోయం వీర్రాజు, సరియం ప్రసాద్, కాక కృష్ణ, కల్లూరి లక్ష్మయ్య, భైరెడ్డి సతీష్, కాంతమ్మ, కుమ్మరికంపట్ల సాంబశివరావు, కొమరం చంటి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News