Sunday, December 22, 2024

ప్రజలంతా చల్లంగా చూడు తల్లీ

- Advertisement -
- Advertisement -

వరంగల్ : డివిజన్ కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డివిజన్ కేంద్రంలో నిర్వహించిన ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టి నైవేద్యాలను సమర్పించారు. ఈ పూజా వేడుకలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు తొర్రూరులో బోనం ఎత్తుకొని మహిళలతో కలిసి నడు స్తూ ముత్యాలమ్మ తల్లికి ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ప్రజలంతా చల్లంగా ఉండే విధంగా చూడు తల్లీ అంటూ ముత్యాలమ్మ తల్లిని మొ క్కుకున్నట్లు తెలిపారు. దేవతల చల్లని చూపుతో రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నట్లు మంత్రి దయాకర్‌రావు తెలిపారు. మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వర్‌రావు, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రాంచంద్రయ్య, వైస్ చైర్మన్ జినుగ సురేందర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News