Monday, December 23, 2024

దేశ ప్రజలంతా మోడీకి మద్దుతు ఇవ్వాలి

- Advertisement -
- Advertisement -
  • మహాజన్ సంపర్క్ అభియాన్ ప్రొగ్రాంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల

సిద్దిపేట: దేశ ప్రజలం తా మోడీకి మద్దుతు ఇవ్వాలని కేంద్ర పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. గురువారం ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన మహాజన్ సంపర్క్ అభియాన్‌లో ఆయన పాల్గొని ప్రముఖ వైద్యుడు డాక్టర్ రాంచందర్‌రా వు, వ్యాపారి కూర పండరి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డిల ఇండ్లకు వెళ్లారు. అనంతరం శివాజీనగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహి ంచి కేంద్ర ప్రభుత్వ పథకాల కరపత్రాలను పం పిణీ చేశారు. ఈ సందర్భంగా రిటైర్డ్ టీచర్ అమరేందర్‌రెడ్డి కాలనీలో నెలకొన్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

కాలనీలో రోడ్లు లేవని, తాగునీరు నాలుగు రోజులకు ఒక్కసారి వ స్తున్నాయని కేంద్ర మంత్రికి తెలిపాడు. అనంతర ం కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల మాట్లాడుతూ ప్రధాని మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బిజెపి ఆధ్వర్యంలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏకా దశి, బక్రీద్ పర్వదినం సందర్భంగా సిద్దిపేటలో ప్రముఖ వ్యక్తులను కలువడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంగ రాంచంద్రారెడ్డి, కొత్త పల్లి వేణుగోపాల్, బైరి శంకర్, రాంచందర్‌రావు, ఉపేందర్‌రావు, తోడుపునూరి వెంకటేశం, ఉడుత మల్లేశం, అంబటిపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News