Sunday, December 22, 2024

అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి

- Advertisement -
- Advertisement -
  • మంత్రి చామకూర మల్లారెడ్డి

మేడ్చల్: అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆషాడమాస బోనాల జాతరలో భాగం గా మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడు గుడులలో ఆదివారం జరిగి న బోనాల పండుగ సందర్భంగా అమ్మవార్లను దర్శనం చేసుకొని ప్రత్యే క పూజలు నిర్వహించారు. ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్తిలిలో ఆదివా రం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. బోనాల పర్వదినోత్స వం పురస్కరించుకొని మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మర్రి శ్రీనివాస్‌రెడ్డి, మహేష్, కో ఆప్షన్ సభ్యులు ఆకిటి నవీన్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఉపసర్పంచ్ మర్రి నర్సింహారెడ్డి, నాయకులు బత్తుల మధుకర్ యాదవ్, నడి కప్పు నాగరాజు, సాటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News