Monday, January 20, 2025

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -
- Advertisement -

భువనగిరి: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. భువనగిరి మండలంలోని మన్నేవారి పంపు గ్రామంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంతో గ్రామల అభివృద్ధికీ మహర్దశ పట్టిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం హయంలోని గ్రామాలు పట్టుకొమ్మలుగా మారాయని ఆయన అన్నారు.

గ్రామాలల్లో సిసి రోడ్డు నిర్మాణం, బిటి రోడ్ల నిర్మాణం తోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలు, నూతన గ్రామ పంచాయతీల భవనాలు విలసిల్లడంతో నేటి గ్రామాలు ఆనాటి పట్టణాలుగా మారాయని అన్నారు. గత ప్రభుత్వాల హాయంలో గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదని సీఎం కేసీఆర్ కృషితోటే గ్రామాల అభివృద్ధి సాధ్యపడిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న పించన్లు పెంచుతూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై నేడు బీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు వలసలు కొనసాగుతున్నాయని అన్నారు.

పార్టీ ప్రవేశపెదుతున్న సంక్షేమ పథకాలలో భాగస్వాములు కావాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందజేయాలన్న ఉద్దేశంతో పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు గుజ్జ వెంకటేశం, పైళ్ల మల్లారెడ్డి, అంకర్ల మల్లేశం, బాలరాజు, పాండు , మెడ బోయిన వెంకటేశం, రాగుల మల్లేశం, ఎమ్మెల్యే సమక్షంలో చేరగా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో గ్రామంలో మృతి చెందిన 40 కుటుంబ సభ్యులకు పైళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం కింద రెండు లక్షల రూపాయిల నగదును అందజేశారు.

ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీలా ఓం ప్రకాష్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ అబ్బ గాని వెంకట్ గౌడ్, మాజీ ఎంపీపీ కేశవపట్నం రమేష్, చందుపట్ల పి ఎస్ సి ఎస్ మాజీ చైర్మన్ బల్గూరి మధుసూదన్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు జక్క రాఘవేందర్ రెడ్డి, తాజ్ పూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాకల శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ బోయినీ పాండు, ఉప సర్పంచ్ యెంపల్ల భానుచందర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News