Monday, December 23, 2024

చెరువులన్నీ గలగల.. రైతుల ముఖాల్లో కళకళ

- Advertisement -
- Advertisement -

వైరా : తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో చెరువులు, రిజర్వాయర్‌లు, ప్రాజెక్టులు నీళ్లతో గలగల లాడుతున్నాయని, దీంతో రైతుల ముఖాల్లో కళకళలాడుతున్నాయని ఖమ్మం పార్లమెంట్ సభ్యలు నామా నాగేశ్వరరావు అన్నారు. బుధవారం వైరాలో సాగునీటి దినోత్సవ వేడుల్లో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ డిఈ బాబూరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపి నామా మాట్లాడుతూ సంవత్సరానికి రెండు పంటలు పండిస్తూ రైతులు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెందేందుకు సిఎం కెసిఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు.

దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని అనేక సంక్షేమ సథకాలను అమలు చేస్తున్న సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర ప్రజలందరూ అండగా ఉండాలని, కెసిఆర్‌ను మూడోసారి సిఎం చేయాలని కోరారు. అనంతరం వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మాట్లాడుతూ రైతులకు సబ్సీడీలు, రైతు బీమా, రైతు బంధు ఇచ్చి ఆదుకున్న ఘనత కెసిఆర్‌దేనన్నారు. తొలుత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి గిరిజన నృత్యాలతో మహిళలు క్రాస్ రోడ్ వరకు నృత్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ రత్నం, ఎంపిపి పావని, మున్సిపల్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, జెడ్‌పిటిసి నంబూరి కనకదుర్గ, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్‌రావు, దిశ కమిటీ సభ్యుడు కట్టా కృష్ణార్జునరావు, ఎసిపి రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News