Wednesday, January 22, 2025

రాష్ట్రం నుంచి రాజ్యసభకు ముగ్గురు ఏకగ్రీవం

- Advertisement -
- Advertisement -

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
మూడు నామినేషన్ల తిరస్కరణ
బిఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర,
కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఎన్నిక

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీలుగా 3 ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారంతో ముగిసింది. మూడు స్థానాలకు బరిలో ముగ్గురే మిగలడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బిఆర్‌ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది రాజ్యసభ సభ్యుల ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. బిఆర్‌ఎస్ ఎంపీలైన వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు.

ఇతర పార్టీలైన శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్, భోజరాజు కోయాల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్ వేశారు. కాగా వారి నామినేషన్లను ఇసి తిరస్కరించింది. రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే ఒక్కో అభ్యర్థికి మద్దతుగా కనీసం 10 మంది ఎంఎల్‌ఎలు సంతకాలు చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్లపై 10 మంది ఎంఎల్‌ఎలు సంతకాలు చేశారు. కానీ మిగిలిన ముగ్గురికి మద్దతుగా ఎంఎల్‌ఎలు ఎవరూ సంతకాలు చేయలేదు. దీంతో వారి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి తిరస్కరించారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి అనంతరం ఇద్దరు కాంగ్రెస్, ఒక బిఆర్‌ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

వద్దిరాజుకు ప్రముఖుల శుభాకాంక్షలు
రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీ వద్దిరాజు రవిచంద్రను పలువురు ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.మాజీ లోకసభ సభ్యులు ప్రొఫెసర్ సీతారాం నాయక్, శాసనమండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్,మాజీ ఎంఎల్‌ఎలు సండ్ర వెంకటవీరయ్య, రేగా కాంతారావు, ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్ అల్లం నారాయణ, తొలి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పిఆర్‌ఒ హజారీ రమేష్, మున్నూరుకాపు ప్రముఖులు మలిశెట్టి సోంనారాయణ, వేల్పుల శ్రీనివాస్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు (ఎవిఆర్), ప్రముఖ రంగస్థల నటుడు చల్లగాలి వెంకటరాజు,నెల్లికుదురు జెడ్‌పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి,జెన్నారెడ్డి మహేందర్ రెడ్డి భండారి శ్రీనివాస్ రెడ్డి, పసుమర్తి వెంకటేశ్వరరావులు ఎంపీ రవిచంద్రను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News