Tuesday, January 21, 2025

ఓటరు నమోదు దరఖాస్తులన్నీ క్లియర్ చేయాలి

- Advertisement -
- Advertisement -

మక్తల్ : 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని, ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించి క్లియర్ చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం ఆయన మక్తల్, మాగనూరు తాహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి, ఓటరు నమోదు ప్రక్రియ జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఓటరు జాబితాలో పేరు కలిగి ఉండి, మరణించిన వారి పేర్లను క్షేత్రస్థాయిలో నిర్ధారించుకుని జాబితాలో నుంచి తొలగించాలన్నారు. మార్పులు, చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ త్వరితగతిన పరిష్కరించి ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటనకు సన్నాహాలు చేయాలన్నారు. కార్యక్రమంలో తాహసీల్దార్ తిరుపతయ్య, డిటి కాళప్ప, ఆర్‌ఐలు విజయ్‌కుమార్, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News