- Advertisement -
న్యూఢిల్లీ: అబార్షన్ల విషయంలో సుప్రీంకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి మహిళకు అబార్షన్‌ను ఎంచుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. గర్భం దాల్చిన 24 వారాల వరకు అబార్షన్ హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పెళ్లితో సంబంధం లేకుండా, వివాహమైనా, కాకున్నా 24 వారాల్లోపు అబార్షన్ హక్కు ఉందని సుప్రీం తెలిపింది. చట్టప్రకారం సురక్షిత అబార్షన్ చేయించుకోవచ్చని స్పష్టం చేసింది. వైవాహిక అత్యాచారం కూడా అబార్షన్ల విషయంలో అత్యాచారంగా భావించాలని కోర్టు అభిప్రాయపడింది. పోస్కో చట్టం ప్రకారం అబార్షన్ చేయమని కోరితే రిజిస్టర్డ్ మెడికల్ పిటిషనర్లు మైనర్ గుర్తింపును వెల్లడించాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు పేర్కొంది.
- Advertisement -