Saturday, November 16, 2024

సంప్రదాయానికి భిన్నంగా..

- Advertisement -
- Advertisement -

గణతంత్ర రోజున ఘన నారీశక్తి
కేవలం మహిళలతోనే రిపబ్లిక్ పరేడ్
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సర్వం మహిళా దళాల రిపబ్లిక్ డే పరేడ్‌తో సాగుతుంది. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని ప్రభుత్వ వర్గాలు ఆదివారం తెలిపాయి. ఇప్పటి నుంచే తగు రీతిలో సంబంధిత ఏర్పాట్లు జరుతున్నాయని వివరించారు. భారతీయ సైనిక బలగంలో, ఇతర కీలక రంగాలలో ఇనుమడించిన నారీశక్తిని ప్రపంచానికి ప్రతీకగా తెలియచేసేందుకు మొత్తం మహిళా దళాల రిపబ్లిక్ డే పరేడ్‌కు సంకల్పించారు. ఈ విషయాన్ని అధికార కర్తవ్యపథ్‌లో ఈ సాంప్రదాయక కవాతు జరుగుతుంది. 2024 రిపబ్లిక్ పరేడ్ గురించి మార్చిలోనే రక్షణ మంత్రిత్వశాఖ వివిధ మంత్రిత్వశాఖలు, త్రివిధ సైనిక బలగాలకు సమాచారం పంపించింది. పలు ప్రభుత్వ విభాగాలు కూడా సంబంధిత పరేడ్‌కు ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేపట్టాలని ఇందులో తెలిపారు.

ఈ సందర్భంగానే కేవలం మహిళా దళాలతో కూడిన కవాతు గురించి పరిశీలించాలని కూడా సూచించారు. తరువాతి క్రమంలో దీనిపై అంగీకారం కుదిరింది. కవాతులో అన్ని విభాగాలకు కేవలం మహిళా సైనిక దళాలే ప్రాతినిధ్యం వహిస్తాయి. నారీశక్తికి సైన్యంలో తగు ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నామని, ఇటీవలే సైన్యం పదాతిబలగంలోకి అపూర్వరీతిలో చారిత్రక ప్రధమంగా ఐదుగురు మహిళా అధికారులను నియమించామని, వీరిలో కొందరిని పాకిస్థాన్, చైనా సరిహద్దులలోని క్లిష్టతరమైన వాతావరణ, భౌగోళిక పరిస్థితుల మధ్య ఉండే స్థావరాలలో విధులకు తరలించారని రక్షణ శాఖ గుర్తు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News