Monday, December 23, 2024

వైకాపా కు ఆళ్ల నాని గుడ్ బై

- Advertisement -
- Advertisement -

ఏలూరు:  వైకాపాకు మరో షాక్ తగిలింది. ఏలూరు జిల్లాకు చెందిన ముఖ్యనేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) రాజీనామా చేశారు. ఆయన ఆ పార్టీలో మాజీ డిప్యూటీ సిఎంగా కూడా పనిచేశారు. ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఆయన ఈ మేరకు రాజీనామా లేఖను వైకాపా అధ్యక్షుడు జగన్ కు పంపారు.

నాని గతంలో డిప్యూటీ సిఎం పదవితోపాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఎన్నికల్లో వైకాపా ఓడినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇదిలావుండగా పిఠాపురం మాజీ ఎంఎల్ఏ పెండెం దొరబాబు కూడా వైకాపాను వీడిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News