Monday, December 23, 2024

ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం: సినీ రచయితకు గాయాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు మెట్ట జాతీయ రహదారి వారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ చెందిన సినీ రచయిత, డైరెక్టర్ టి రాజసింహ తన  కారులో హైదరాబాదు నుంచి తిరుపతికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం తప్పించబోయి ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. అతడి ఎడమ కాలు విరిగిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. వాహనదారుల సమాచారం మేరకు ఎస్ఐ నర్సింహులు ఘటనా స్థలానికి చేరుకొని రాజసింహాన్ని ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రధమ చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు. సరైనోడు, రుద్రమదేవి, బావగారు బాగున్నారా, దాదాపు 60 సినిమాలకు రాజసింహ రచయితగా పనిచేశారు. ఒక అమ్మాయి తప్ప అనే సినిమాకు డైరెక్టర్ గా పనిచేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News