Monday, December 23, 2024

వైవాహిక అత్యాచారం నేరం కాదు

- Advertisement -
- Advertisement -

వైవాహిక అత్యాచారంపై అలహాబాద్ హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పు వెలువరించింది. భార్య వయసు 18 ఏళ్లు పైబడి ఉంటే, భర్త లైంగిక కలయికకోసం బలవంతం చేసినా నేరం కాదని స్పష్టం చేసింది. సంజీవ్ గుప్తా అనే వ్యక్తిపై అతని భార్య 2013లో కేసు దాఖలు చేసింది. భర్త తనకు ఇష్టం లేకపోయినా తనపై లైంగిక దాడి చేశాడన్నది ఆమె ఆరోపణ. దీనిపై విచారణ చేపట్టిన ఘజియాబాద్.. భర్తను దోషిగా నిర్ధారించింది. అయితే సంజీవ్ గుప్తా అప్పీలుకు వెళ్లాడు.

ఈ కేసులో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెబుతూ సంజీవ్ గుప్తా తన భార్యపై ఐపీసీ సెక్షన్ 377 కింద ‘అసహజ నేరానికి’ పాల్పడిన దాఖలు లేవని స్పష్టం చేస్తూ నిందితుడిపై పెట్టిన కేసును కొట్టివేసింది. భారతదేశంలో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడం లేదని, ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉందనీ పేర్కొంది. అయితే తన భర్త కట్నం కోసం దారుణంగా హింసిస్తున్నాడంటూ నిందితుడి భార్య ఐపిసి 323, 428 ఏ సెక్షన్ల కింద పెట్టిన కేసులను హైకోర్టు పరిశీలించి, నిందితుడిని దోషిగా నిర్థారించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News