Monday, December 23, 2024

సెక్స్ నిరాకరణ.. భర్తను కాదన్న భార్యకు కోర్టు చురక

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : భార్యను భర్త లేదా భర్తను భార్య ఎటువంటి సరైన కారణాలు లేకుండా లైంగికతకు దూరం పెట్టడం అనుచితమే అవుతుందని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. జీవితభాగస్వాములలో ఏ ఒక్కరు ఈ విధంగా చేసినా ఇది మానసిక క్రూరత్వానికి పాల్పడినట్లే అవుతుందని హైకోర్టు ఈ సునిశిత అంశంపై రూలింగ్ వెలువరించింది. భార్య తనతో చిరకాలంగా సెక్స్‌కు అంగీకరించనందున దీనితో తాను విసిగెత్తి విడాకుల కోసం ఫ్యామిలీకోర్టుకు వెళ్లగా అక్కడ తన పిటిషన్‌ను కొట్టివేశారని, న్యాయం కల్పించాలని భర్త హైకోర్టును వేడుకున్నారు. ఈ కేసు పూర్వాపరాలు వాదనల తరువాత హైకోర్టు తీర్పు వెలువరించింది.

పరిణామాలను అన్నింటిని గమనించిన తరువాత ఈ దంపతులు వేర్వేరుగా ఉంటున్నారని, భార్య భర్త పట్ల తన వైవాహిక సంబంధిత లైంగిక బాధ్యతలను నిర్వర్తించడం లేదని వెల్లడైందని కోర్టు తెలిపింది. 1979లో వీరి వివాహం అయింది. దాంపత్యానికి తాను కోరగా నిరాకరిస్తూ చివరికి పుట్టింటికి వెళ్లిందని భర్త తన పిటిషన్‌లో తెలిపారు. తనను కాదని వెళ్లిన ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని, ఇదంతా కూడా తన పట్ల క్రూరత్వం కనబర్చినట్లే అయిందని పేర్కొన్న పిటిషనర్ వాదనతో న్యాయమూర్తులు సునీత్ కుమార్, రాజేంద్రకుమార్ ఏకీభవించారు. ఫ్యామిలీకోర్టు ఈ వ్యక్తికి విడాకులకు అనుమతిని ఇవ్వకపోవడం అనుచితంగా ఉందని తెలిపిన ధర్మాసనం విడాకులకు డిక్రీ వెలువరించారు. దాంపత్య జీవితానికి ఆమె నిరాకరణ, తరువాత వేరే వ్యక్తితో జీవితం పంచుకోవడం ఇవన్నీ కూడా కసికిందికే వస్తాయని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News