Monday, December 23, 2024

రెక్కలు తొడిగి రివ్వున ఎగిరే…

- Advertisement -
- Advertisement -

Allantha durana Movie

 

‘అల్లంత దూరాన‘ చిత్రంలో హుషారుగా సాగే ఓ యూత్‌ఫుల్ పాటను హైదరాబాద్‌లోని ఎం.వి.ఎస్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ మధ్యన విడుదల చేశారు. హీరో విశ్వ కార్తికేయ తాజాగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా ప్రముఖ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్‌గా నటించింది. చలపతి పువ్వల దర్శకత్వంలో ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కోమలి సమర్పణలో నిర్మాత ఎన్.చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషలలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘రెక్కలు తొడిగి రివ్వున ఎగిరే గువ్వల గుంపే మనమైపోదాం …” అంటూ సాగే పాటను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత ఎన్.చంద్రమోహనరెడ్డి మాట్లాడుతూ “వాస్తవానికి దగ్గరగా స్టూడెంట్స్ అందరి జీవితంలో జరిగే విషయాలే ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం” అని అన్నారు. దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ “ స్క్రీన్ పై మిమ్మల్ని మీరే చూసుకున్న భావనతో ఈ చిత్రం ఉంటుంది. సినిమాలోని పాటలన్నీ వేటికవే హైలైట్ గా ఉంటాయి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత డిఎస్ రావు, హీరో విశ్వ కార్తికేయ, హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News