Wednesday, January 22, 2025

చక్కటి ప్రేమకథ చిత్రం

- Advertisement -
- Advertisement -

విశ్వ కార్తికేయ హీరోగా, సీనియర్ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘అల్లంత దూరాన’. చలపతి పువ్వల దర్శకత్వంలో ఆర్.ఆర్. క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కోమలి సమర్పణలో ఎన్. చంద్రమోహనరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ భాషలలో రూపొందిన ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆదివారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటి ఆమని, హ్రితిక శ్రీనివాస్ సినిమా విశేషాలను తెలియజేశారు. ఆమని మాట్లాడుతూ, చక్కటి ప్రేమకథతో ఈ సినిమా విజువల్ ఫీస్ట్‌గా ఉంటుంది.

కెమెరామెన్, సంగీతం దర్శకుడు, దర్శకుడి పనితనంతో ఈ సినిమా అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇక నటికి ఎన్ని పాత్రలు చేసినా సంతృప్తిరాదు. ఇంకా ఏదో చేయాలనే తపన వుంటుంది. అలాగే నాకు అమ్మవారి పాత్ర, పోలీసు పాత్ర… ఇలా మరికొన్ని భిన్నమైన పాత్రలు చేయాలనుంది. అలాగే దర్శకులు రాజమౌళి, సుకుమార్, పూరి జగన్నాథ్, మణిరత్నం సినిమాల్లో నటించాలని ఉంది. హీరోయిన్ హ్రితిక శ్రీనివాస్ మాట్లాడుతూ, నటనలో అత్త ఆమని ఇన్సిపిరేషన్. నేను తాజాగా తమిళంలో నేను నటించిన సినిమా తాజాగా విడులైంది. కన్నడలో ఓ సినిమా చేశాను. ఇప్పుడు తెలుగులో ఈ సినిమా చేశాను. ముందుముందు మంచి పాత్రలు వస్తాయని అనుకుంటున్నానని అని చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకురాలు కోమలి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News