Sunday, December 22, 2024

న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

హీరో అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో వచ్చిన ’నాంది’ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు కమర్షియల్ సక్సెస్ అందుకుంది. తాజాగా నరేష్, విజయ్ కలయికలో రెండో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నం.5గా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చాలా ఆసక్తికరంగా వుంది. రక్తపు మరకలతో నిండిన సంకెళ్ళు వేసిన చేతులు, ఆ చేతుల నీడ గోడపై స్వేఛ్చగా ఎగిరే ఒక పక్షిలా కనిపించడం విశేషం. దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమా కోసం పవర్‌ఫుల్ కథను సిద్దం చేశారు. ఈ చిత్రం న్యూ ఏజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుంది. ఈ సినిమాలో నరేష్ మరో ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు.

Allari Naresh and Director Vijay Announces New Movie

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News