Monday, December 23, 2024

అల్లరి నరేష్‌ కొత్త అవతారం.. ‘ఉగ్రం’ ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ఉగ్రంపై అంచనాలని పెంచింది.

ఈ రోజు మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు. ట్రైలర్ ఉగ్రం కథాంశాన్ని రివిల్ చేసింది. నగరంలో మిస్సింగ్ కేసుల వెనుక ఉన్న కొంతమంది పవర్ ఫుల్ వ్యక్తులపై నిజాయితీ గల పోలీసు భారీ రిస్క్ తీసుకొని చేసిన పోరాటం ఉగ్రం. అతని కుటుంబాన్ని కూడా టార్గెట్ చేస్తారు. అయితే అతను కేసును ఛేదించి, నేరస్థులను పట్టుకోవడానికి మొగ్గుచూపుతాడు.

ట్రైలర్‌లో అల్లరి నరేష్ కొత్తగా, మునుపెన్నడూ చూడని ఫెరోషియస్ పాత్రలో కనిపించారు. ముఖ్యంగా, ట్రైలర్ రెండవ సగం అతన్ని బ్రూటల్ అవతార్‌లో ప్రజంట్ చేసింది. ట్రైలర్ ఇంటెన్సివ్, గ్రిప్పింగ్, రివిటింగా ఉంది.

విజయ్ కనకమేడల పాత్రను ఇంటెన్స్ గా ప్రజంట్ చేయడంతో పాటు సబ్జెక్ట్‌ని ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. ట్రైలర్‌లో యాక్షన్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌కు హామీ ఇస్తుంది. సిద్ టాప్-నాచ్ సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల అద్భుతమైన బీజీఏం గ్రేట్ వాల్యుని జోడించాయి. నరేష్ భార్యగా మిర్నా కనిపించింది.

ఉగ్రం చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. నిర్మాణ ప్రమాణాలు చాలా ఉన్నతంగా వున్నాయి. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్, ఫస్ట్-క్లాస్ టెక్నికాలిటీస్ తో ట్రైలర్ అంచనాలని పెంచింది. అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో పెద్ద హిట్ అందించనున్నారు. వేసవి కానుకగా మే 5న ఉగ్రం థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News