Thursday, January 23, 2025

‘ఉగ్రం’ పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌ ఉగ్రంపై అంచనాలని పెంచింది. అల్లరి నరేష్, విజయ్ కనకమేడల మరో పెద్ద హిట్ అందించనున్నారని ప్రమోషనల్ కంటెంట్ భరోసా ఇచ్చింది.

ఈ రోజు ఉగ్రం టైటిల్ సాంగ్ ని విడుదల చేశారు మేకర్స్. శ్రీచరణ్ పాకాల ఈ టైటిల్ ట్రాక్ ని హైలీ పవర్ ఫుల్ నెంబర్ గా కంపోజ్ చేశారు. గూస్ బంప్స్ తెప్పించే ఎమోషన్ తో ఈ పాటని స్కోర్ చేసి స్వయంగా అలపించారు. చైతన్య ప్రసాద్ ఈ పాటకు పవర్ ఫుల్ లిరిక్స్ అందించారు. టైటిల్ ట్రాక్ నరేష్ ఉగ్రరూపాన్ని ప్రజెంట్ చేసింది. పాటలో కనిపించిన విజువల్స్ ఇంటెన్సివ్, గ్రిప్పింగ్, స్టన్నింగా వున్నాయి. ఉగ్రం చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. వేసవి కానుకగా మే 5న ఉగ్రం థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News