Monday, December 23, 2024

అల్లరి నరేష్ 59వ సినిమా ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సూపర్ హిట్ సినిమా ‘నాంది’ తర్వాత అల్లరి నరేశ్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. నరేష్ 59వ సినిమాగా తెరకెక్కనున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు మంగళవారం హైదరాబాద్ లో జరిగాయి. ముహూర్తపు స‌న్నివేశానికి బాలు మున్నంగి  క్లాప్‌  కొట్టగా, అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ప్రడ్యూసర్ అనిల్ సుంకర గౌర‌వ ద‌ర్శకత్వం వ‌హించారు. ఈ సినిమాలో నరేష్ సరసన అనంది హీరోయిన్ గా నటిస్తుంది. ఎ.ఆర్‌.మోహ‌న్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ, బాలాజీ గుత్త కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ చ‌ర‌ణ్ పాకాల సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు.

Allari Naresh’s 59th Movie launched 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News