Monday, December 23, 2024

‘ఉగ్రం’ వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

అల్లరి నరేష్, విజయ్ కనకమేడల టీమ్ వర్క్ తెలుగులో క్రేజీ కాంబినేషన్‌లో ఒకటిగా మారుతోంది. వీరిద్దరు కలిసి చేసిన మొదటి చిత్రం ‘నాంది’ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ సక్సెస్‌ని అందుకొని వారి రెండవ చిత్రం ‘ఉగ్రం’ పై భారీ అంచనాలను పెంచింది. మేకర్స్ సోమవారం సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

వేసవిలో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌లో ఒకటిగా ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. తూమ్ వెంకట్ కథ అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News