Wednesday, January 22, 2025

సిఎం రేవంత్ సోదరుడిపై ఆరోపణలు అవాస్తవం: డేవిడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల కొండల్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం దారుణమైన విషయమని డేవిడ్ తెలిపారు. డేవిడ్ దగ్గర అనుముల కొండల్ రెడ్డి డబ్బులు తీసుకొని ఎగొట్టాడని సోషల్ మీడియాలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై డేవిడ్ స్పందించారు. అనుముల కొండల్ రెడ్డి మీద తాను చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. తెలంగాణలో ఎన్నికల ముందు కొంతమంది వ్యక్తులు తనని ప్రలోభ పెట్టడంతోనే ఈ వీడియో చేశానని చెప్పారు. తన వయస్సు 80 సంవత్సరాలు ఉంటుందని, తాను మెడిసిన్ తీసుకుంటున్నానని, అప్పుడప్పుడు అన్కాన్షియస్ ఉండడం వల్ల ఈ వీడియోని తాను చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కొండల్ రెడ్డి తనకు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సింది లేదని డేవిడ్ లేఖ చదివి వినిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News