అమరావతి: డా సునీత పిటిషన్‌లో సిఎం జగన్ మోహన్ రెడ్డిపై కీలక ఆరోపణలు వచ్చాయి. 19.11.2021న అసెంబ్లీలో ఎంపి అవినాశ్ రెడ్డికి సిఎం జగన్ క్లీన్ చిట్ ఇచ్చారు. నిందితునికి జగనే క్లీన్‌చిట్ ఇవ్వడం పలు అనుమానాలకు తావునిస్తోంది. అవినాశ్ రెడ్డి పేరు బయటకు వచ్చిన తరువాత జగన్ యాక్టివ్ అయ్యారు. ఛార్జీషీటులో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివవంకర్ రెడ్డిల పేర్లు బయటకు రావడంతో అవినాశ్‌ను రక్షించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సహా ప్రముఖులు అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారని డా సునీత ఆరోపణలు చేశారు. 19.11.2021న శివశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో సిబిఐ హాజరుపరిచినప్పుడు అవినాశ్ రెడ్డి అక్కడకు వచ్చి అరగంట పాటు శివశంకర్ రెడ్డితో ఉన్నారని, శివ శంకర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ అధికారులను అవినాశ్ బెదిరించారు. అవినాశ్ రెడ్డి, శివ శంకర్ రెడ్డిని సజ్జల గుడ్డిగా సమర్ధించారని, సిబిఐపైనే నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ సునీత పిటిషన్ వేశారు.
సునీత పిటిషన్‌లో జగన్‌పై ఆరోపణలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -