వాషింగ్టన్ : చైనా లోని వుహాన్ లోగల ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా వైరస్ పుట్టిందని, అలాగే కరోనా వ్యాప్తి వెనుక కుట్ర కోణం కూడా ఉందని అనేక ఆరోపణలు చెలరేగిన నేపథ్యంలో వీటన్నిటికీ ఆధారాలు లభించడం లేదని అమెరికా నిఘా సంస్థల నివేదిక క్లీన్ చిట్ ఇవ్వడం విశేషం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతోపాటు మరో సంస్థ కూడా ఈ దర్యాప్తును చేపట్టగా, తాజాగా నాలుగు పేజీల నివేదిక బయటకు వచ్చింది. కరోనా వైరస్ ప్రత్యక్షంగా ఆ ల్యాబ్ నుంచే పుట్టిందని
చెప్పడానికి ఆనవాలు ఏం దొరకలేదని ఏజెన్సీలు తమ నివేదికలో పేర్కొన్నాయి. కరోనా సమయంలో ఇనిస్టిట్యూట్ లోని ల్యాబ్‌లో కరోనాపై పరిశోధనలు జరిగాయి. కానీ ప్రీ కొవిడ్ సమయంలో అలాంటి వైరస్‌ల మీద పరిశోధనలు జరిగినట్టు ఆధారాలు దొరకలేదని నిఘా నివేదిక వెల్లడించింది. వుహాన్ పరిశోధన కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం కూడా 2021 ఫిబ్రవరిలో సందర్శించిన సంగతి తెలిసిందే. కానీ ఎటూ తేల్చలేక పోయింది