Monday, January 20, 2025

అల్లెగ్రోతో 500 మందికి ఉపాధి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆటోమోటివ్, వి ద్యుత్ వాహనాల తయారీలో ఉపయోగించే మ్యా గ్నెటిక్, సెన్సర్లు, చిప్‌ల తయారీలో దిగ్గజ సంస్థ అల్లెగ్రో మైక్రోసిస్టమ్స్ హైదరాబాద్‌లో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డి) విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ముం దుకొచ్చిందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. శుక్రవారం అల్లెగ్రో కం పెనీ ప్రతినిధులతో ఎంఓయూ పూర్తయిన అనంత రం సచివాలయంలో మీడియా సమావేశంలో ప్రసంగించారు. ఈ సంస్థ పరిశోధన కేంద్రం ఏర్పాటు వల్ల 500 మంది ప్ర తిభావంతులకు ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. తెలంగాణాలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి సంతృప్తి చెందిన

తర్వాత హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు అల్లెగ్రో యాజమాన్యం తెలపడం హర్షదాయకమన్నారు. అభివృద్ధి, పరిశోధన కేంద్రం ఏర్పాటులో ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందని ఇచ్చారు. అ ల్లెగ్రో రాకతో రాష్ట్రంలో సెమీకండక్టర్ చిప్‌ల త యారీ పరిశ్రమకు ఊతం లభిస్తుందని మంత్రి పే ర్కొన్నారు. విద్యుత్ వాహనాల సిగ్నల్ డిజైన్, వెరిఫికేషన్, వ్యాలిడేషన్‌తో పాటు రోబోటిక్ ఆటోమేషన్‌లోనూ అల్లెగ్రా చిప్‌లను రూపొందిస్తుందని వె ల్లడించారు. బిఎండబ్ల్యు విద్యుత్తు కార్ల తయారీ సంస్థతో పాటు ఇవి రంగంలో బ్యాటరీల నిర్వహణ, పవర్ చిప్‌ల తయారీలో ఈ సంస్థ అగ్రగామిగా ఉందని శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లెగ్రో మై క్రోసిస్టమ్స్ సిఇఓ వినీత్ నర్గావాలా, సీనియర్ విపి సుమన్ నారాయణ్, మరో సీనియర్ విపి మ్యాక్స్ గ్లోవర్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News