Friday, April 4, 2025

సోనియా మెప్పు కోసమే HCU భూమి అమ్ముతున్నారు: ఏలేటి

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై మంగళవారం ఏలేటి మీడియాతో మాట్లాడుతూ.. HCU భూమిని ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు సిఎం రేవంత్ కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి తన పదవి కాపాడుకోవడానికి, సోనియా గాంధీ దగ్గర మెప్పు పొందడానికి రూ.40 వేల కోట్ల భూమిని కేవలం రూ.20 వేల కోట్లకే రాబర్ట్ వాద్రా బినామీకి అమ్ముతున్నారని మండిపడ్డారు.

ఈ వివాదంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా సిఎం రేవంత్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.నిన్న జేసీబీల దౌర్జన్యానికి HCUలో నెమళ్ళు, జింకలు చనిపోయాయని, రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్ప ఏమీ చేతకాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News