Wednesday, January 15, 2025

రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే.. రాజీనామా చేస్తా: రేవంత్ కు ఏలేటి సవాల్

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే, బీజేెల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రుణమాఫీ చేశామని ఆగస్టు 15న సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీనిపై మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు పూర్తిగా వంద శాతం రుణమాఫీ అయ్యిందని నిరూపిస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.

రుణమాఫీ కాలేదని తేలితే.. సిఎం రేవంత్ రాజీనామాకు సిద్ధమా అని సవాల్ విసిరారు. దీనిపై రైతుల సమక్షంలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 60లక్షల మంది రైతులుంటే 22 లక్షల మందికే రుణమాఫీ చేశారని ఆయన మండిపడ్డారు. రూ.49వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా రూ.17వేల కోట్లిచ్చారని.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఏలేటి ఫైరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News