- Advertisement -
రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీఎల్పీ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. కాంగ్రెస్ సర్కార్ కులగణనకు శ్రీకారం చుట్టింది. బుధవారం నుంచి రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సర్కార్ పై మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్‌లపై చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కేవలం రాజకీయ లబ్ధికోసం కులగణన చేస్తున్నారని విమర్శించారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన 21 హామీలు నెరవేర్చారా?. 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పిన మీరు ఎందుకు అమలు చేయడం లేదు?. మంత్రి పదవుల్లో ఎంతమంది బీసీ మంత్రులున్నారు?.. ముఖ్యమంత్రి చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు.
- Advertisement -