కాంగ్రెస్ నాయకులు.. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టారని బిజెపి ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. వైద్యానికి పెద్దపీట వేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నారని హాగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత మీద కనికరం లేకుండా లాఠీ ఛార్జ్ చేయించారని.. రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పటి వరకు భర్తీ చేస్తారో ముఖ్యమంత్రి చెప్పాలని నిలదీశారు.
హైదరాబాద్ లోని పార్టీ ఆఫీస్ లో మీడియాతో మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి.. పార్టీ ఫిరాయింపుల మీద స్పీకర్‌కు ఫిర్యాదు చేద్దామంటే అందుబాటులో ఉండటం లేదన్నారు. పౌర సరఫరాల శాఖ అవినీతిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పడం లేదని చెప్పారు. పీడీఎస్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ.. అతిపెద్ద కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. నీటి పారుదల, పౌర సరఫరాలశాఖలో జరుగుతున్న అవినీతిని ఆధారాలతో సహా త్వరలో బయటపెడుతామన్నారు. దానం నాగేందర్ మీద అనర్హత పిటిషన్ ఇస్తున్నామని మహేశ్వర్ రెడ్డి చెప్పారు.