మీ మేనిఫెస్టో లో మూసి ప్రక్షాళన ఉంది, దానికి నిధులు ఎందుకు కేటాయించలేదు? అంటూ బిజెఎల్‌పి నేత మహేశ్వరరెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం బడ్జెట్ పద్దులపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ మూసికి సంబంధించి నిధులు ఇస్తారా లేదా…? హైదరాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన మూసికి నిధులు ఇస్తారా లేదా..?, మూసి అభివృద్ధి తెలంగాణలో అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. అనేక రాష్ట్రాల్లో కాలువల అభివృద్ధికి నిధులు ఇస్తున్నారని, గాంధీని వ్యతిరేకించే మీరు గాంధీ స్మృతివనంకి నిధులు ఇస్తారా లేదా…? తెలంగాణ ప్రజలకు చెప్పాలన్నారు.
హైదరాబాద్‌కి సంబంధించినఅంశాల్లో మీరు మేనిఫెస్టో లో పెట్టారని వెల్లడించారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకుపోతున్నమని తెలిపారు. మూసి నిర్వాసితులను బలవంతంగా ఎక్కడ తొలగించడం లేదు, వారికి పునరావాసం కల్పిస్తూ అన్ని రకాల సహకారం ఇస్తున్నామని వెల్లడించారు. హైదారాబాద్ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తామని మేనిఫెస్టోలో చెప్పారు మరి నిధులు ఎందుకు కేటాయించడం లేదు? అని ప్రశ్నించారు. ఏం లేకుండానే ప్రభుత్వం మీద బట్ట కాల్చి మీద వేస్తున్నారని చెప్పుకొచ్చారు. మూసి పునరాభివృద్ధికి మీరు నిధులు కేటాయిస్తారా లేదా ..? మీరు మేనిఫెస్టో లో పెట్టిన విధంగా నిధులు ఎందుకు కేటాయించడం లేదని సూటిగా ప్రశ్నించారు.
సిఎం ఈసా మూసి ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడ బాపు ఘాట్ దగ్గర గాంధీ స్మృతి వనం కట్టి దేశంలోనే బాపు ఘాట్ అభివృద్ధి చేసుకోవాలని సిఎం ఆలోచన అని అన్నారు. అలా చేయడం వల్ల అక్కడ అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపారు. ఒక నగరంలో రెండు ప్రాంతాలను కలుపుతూ నదులు పోయే ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందన్నారు. ఏదో దుర్బుద్ధి ఉందని ప్రభుత్వంను బదనం చేయడం తగదని బిజెఎల్పీ మహేశ్వరరెడ్డిపై మంత్రి పొన్నం మండిపడ్డారు.