Sunday, September 8, 2024

ఇండియా కూటమి సిఎంల చర్యకు కేంద్రానిదే బాధ్యత: డి రాజా

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాలను బహిష్కరించాలన్న పలువురు ముఖ్యమంత్రుల నిర్ణయాన్ని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా శనివారం సమర్థించారు. కేంద్రం తీసుకున్న కొన్ని చర్యలు వారి నిర్ణయానికి కారణమని రాజా అన్నారు. పన్నులు, నిధులను కేంద్ర ప్రభుత్వం సరిగ్గా పంచడం లేదని రాజా ఆరోపించారు. ‘నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్న సిఎంలకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి సిసలైన సమస్యలు. కేంద్ర ప్రభుత్వ చర్యలే అందుకు కారణం’ అని రాజా భువనేశ్వర్‌లో విలేకరులతో చెప్పారు.

రాజ్యాంగం భారత్‌ను రాష్ట్రాల యూనియన్‌గా నిర్వచిస్తున్నదని రాజా చెబుతూ.. ‘అంటే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సమానంగా పరిగణించాలి. పన్నులు, నిధుల పంపకం సరిగ్గా ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయడం లేదు’ అని పేర్కొన్నారు. ‘అది రాజ్యాంగం నిర్దేశమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం అలా చేయడం లేదు. కేంద్ర ప్రభుత్వ దృక్పథం కొంత మేరకు వివక్షపూరితంగా ఉంటున్నది. తమకు అన్యాయం జరిగిందని కొన్ని రాష్ట్రాలు భావిస్తున్నాం. వారి వాణిని మన్నించడం లేదు. వారి డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడం లేదు’ అని రాజా ఆరోపించారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం, బిజెపి సమాఖ్యతత్వాన్ని అర్థం చేసుకోవడం లేదని ఆయన విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News