Monday, December 23, 2024

బిజెపితో సర్దుబాట్లపై జెడిఎస్ స్వామి

- Advertisement -
- Advertisement -

రామనగర (కర్నాటక) : లోక్‌సభ ఎన్నికలకు ఇతర పార్టీలతో సర్దుబాట్లు లేదా అవగావహనపై ఇప్పుడు ఎటువంటి ఆలోచన తమకు లేదని జెడిఎస్ అధ్యక్షులు హెచ్‌డి కుమారస్వామి తెలిపారు. పరిస్థితిని బట్టి అవసరం అయినప్పుడు దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కర్నాటక మాజీ సిఎం అయిన కుమారస్వామి తెలిపారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో జెడిఎస్ బిజెపితో ఎన్నికల సర్దుబాట్లకు దిగుతుందని ఇటీవల వార్తలు వెలవడుతాయి. పార్టీల మధ్య ఎప్పటికప్పుడు ఏదో ఒక లోపాయికారి అంశంపై చర్చ జరగడం సర్వసాధారణం. ఇందులో అనేకం కేవలం ఊహాగానాలకు కూడా దారితీస్తుంటాయని కుమారస్వామి తెలిపారు.

ఇప్పుడు వెలువడ్డ వార్త కేవలం వదంతా లేక ఇందులో నిజం ఉందా? అనేదానిపై కేవలం ఎన్నికల దశలోనే లేదా ఈ ప్రక్రియల తరుణంలోనే ఏదైనా చెప్పేందుకు వీలుంటుందన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో జెడిఎస్ ఈసారి అతి తక్కువ స్థానాలతో చతికిల పడింది. దీనితో పరస్పర మేలు దిశలో బిజెపి, జెడిఎస్‌లు వచ్చే లోక్‌సభ ఎన్నికలలో కలిసి పోటీచేసేందుకు వీలుందని వార్తలు వెలువడ్డాయి. గత ఐదురోజులుగా తమ పార్టీలో జిల్లాలవారి సమీక్షా సమావేశాలు జరిగాయని, ఇందులో గెలుపోటములపై సమీక్ష జరిగిందని, తన పట్ల పార్టీ కేడర్ అంతా విశ్వాసం ఉంచిందని కుమార తెలిపారు. ఈ భేటీలో ఇతర విషయాల ప్రస్తావన ఏదీ రాలేదని తెలిపిన ఆయన అవరం అయినప్పుడు ఇతర విషయాలు చర్చకు వస్తాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News