వైసీపీని గద్దె దించడమే లక్ష్యం
నేడు చంద్రబాబు నివాసంలో 8 గంటల పాటు చర్చలు
జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ సీట్లు
మన తెలంగాణ/హైదరాబాద్: ఏపీలో వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా చేతులు కలిపిన టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటుపై ఓ అవగాహన కుదిరింది. సోమవారం ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశంలో ఈ మధ్యాహ్నం నుంచి దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశం ముగిసింది. టీడీపీ తరఫున చంద్రబాబు, జనసేన నుంచి పవన్ కల్యాణ్, బీజేపీ తరఫున గజేంద్ర సింగ్ షెకావత్, బైజయంత్ పండా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటు, ఎవరెక్కడ పోటీ చేయాలన్న అంశంపై క్షుణ్ణంగా చర్చించారు.
సుదీర్ఘ సమావేశం అనంతరం సీట్ల పంపకం వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం 31 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, జనసేన పోటీ పొత్తులో భాగంగా మూడు పార్టీల నేతల ఏకాభిప్రాయం కుదిరింది. 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్న బీజేపీ. 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ తమ కోటా నుంచి బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన జనసేన తమ కోటా నుంచి ఒక అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చింది.