Monday, December 23, 2024

సిఎంకు శాట్స్ చైర్మన్ కృతజ్ఞతలు

- Advertisement -
- Advertisement -

Allipuram venkateshwar reddy thanks to CM KCR

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం శాసనసభలో ప్రకటన చేయడంపై రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ నిరుద్యోగులకు సిఎం తీపి కబురు చెప్పడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. అంతేగాక తాత్కాలిక సిబ్బంధిని కూడా క్రమబద్ధీకరిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని చైర్మన్ స్వాగతించారు. శాట్స్‌లో ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న ఉద్యోగులకు ఇది వరంగా మారిందన్నారు. ఈ మేరకు చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి సిఎం కెసిఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపార. మరోవైపు ఉద్యోగాల భర్తీలో స్పోర్ట్ కోటా కింద రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, వీటిని రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News