Monday, January 20, 2025

బెజవాడ కనకదుర్గమ్మ వారి సేవలో అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు లౌకిక, మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా జాతీయ పార్టీ ప్రారంభిస్తున్న సందర్భంగా కెసిఆర్ కు ఆయు, ఆరోగ్యాలను ప్రసాదించాలని, వారి ఆశయ సంకల్పానికి అమ్మవారు ఆశీర్వాదం అందించాలని ప్రార్థించారు. దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా కెసిఆర్ నాయకత్వం ఎదగాలని, నేడు తెలంగాణ ప్రజలకు అందుతున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి ఫలాల మాదిరిగా దేశంలోని దళిత, గిరిజన, రైతులకు అందించాలని, ప్రతి పేదవారి ముఖంలో, చిరు నవ్వులు చింది ప్రపంచ దేశాల్లో భారత దేశం అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News