Sunday, February 23, 2025

ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి : ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు మంజూ రు చేయాలని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కోరారు. మంగళవారం జీహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్‌రోస్‌ను ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి జీహెచ్‌ఎంసి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏడు రోజులుగా ఉప్పల్ నియోజకవర్గంలోని వివిధ కాలనీల్లో పాదయాత్ర చేస్తున్ననని కాలనీవాసులు సిసిరోడ్డు, ఒపెన్ జిమ్, కమ్యూనిటీహల్ నిర్మాణం వంటి సమస్యలు తెలియజేస్తున్నారని సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజురు చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు జనంపల్లి వేంకటేశ్వర్‌రెడ్డి, కటెపల్లి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News