Tuesday, December 24, 2024

బోడుప్పల్ అభివృద్ధికి నిధులు కేటాయించండి

- Advertisement -
- Advertisement -

బోడుప్పల్ : బోడుప్పల్ నగర పాలక సంస్థ అభివృద్ధి కో సం రూ. 100 కోట్లు నిధులు కేటాయించాలని రాష్ట్ర మంత్రి కెటిఆర్‌ను బోడుప్పల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి ,అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డిలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మ ల్లారెడ్డి నేతృత్వంలో బోడుప్పల్ కార్పొరేటర్లతో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ మేరకు బోడుప్పల్ నగరానికి కావాల్సిన నిధుల వివరాలను మంత్రి కెటిఆర్‌కు అందించి సాధ్యమైనంత మేరుక త్వరగా మంజూరు చేయాల్సిందిగా కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కెటిఆర్ బోడుప్పల్ అభివృద్ధి కోసం అవసరమైన నిధులు వచ్చేలా చూస్తానని హామి ఇచ్చినట్లు తెలిపారు. కెటిఆర్‌ను కలిసిన వారిలో బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిగౌడ్ ,కార్పొరేటర్లు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News