Thursday, January 23, 2025

అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపు

- Advertisement -
- Advertisement -

వనపర్తి : వనపర్తి నియోజకవర్గం పరిధిలోని గట్టుకాడిపల్లి వెంకటే శ్వర స్వామి ఆలయానికి రూ. 2.50 కోట్లు మంజూరు అయినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెబ్బేరు మండలం బున్యాదిపూర్ లో రహదారులకు రూ. 83.90 లక్షలు, వనపర్తి టౌన్ హాల్ నిర్మాణానికి అదనంగా రూ. 75 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. గతంలో టౌన్ హాల్ నిర్మాణానికి రూ. 5 కోట్లు కేటాయించారని తెలిపారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో డ్రెయిన్లు, సిసి రహదారుల నిర్మాణానికి రూ. 1.90 కోట్లు కేటాయించారని తెలిపారు. ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధతో గట్టుకాడిపల్లి ఆలయ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయని నిధులు విడుదల ద్వారా మరింత అభివృద్ధికి అవకాశం ఏర్పడిందన్నారు. పెద్ద ఎత్తున నిధుల రాకతో బున్యాదిపూర్ రూపు రేఖలు మార నున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన సందర్భంగా ఇచ్చిన హామి మేరకు నిధులు విడుదల చేశారని, వనపర్తి నియోజకవర్గానికి నిధుల మంజూరు పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిలకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News