Sunday, December 22, 2024

దర్శకుడు ఎన్.శంకర్‌ భూ కేటాయింపుపై హైకోర్టు తీర్పు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేసిన భూకేటాయింపు చట్టబద్ధతను సమర్థిస్తూ సినీ దర్శకుడు, నిర్మాత ఎన్ శంకర్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పునిచ్చింది. శంకర్ కు భూ కేటాయింపులో జోక్యం చేసుకుకోలేమని తేల్చి చెప్పింది. శంకర్‌కు భూమి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్ ను శుక్రవారం కోర్టు కొట్టివేసింది. రంగారెడ్డి జిల్లా మోకిలా, శంకరపల్లిలో ఉన్న ఐదెకరాల భూమిని ప్రభుత్వం 2019లో శంకర్‌కు మంజూరు చేసింది. ఫిల్మ్ స్టూడియో నిర్మాణానికి వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కేటాయింపు జరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News