- Advertisement -
హైదరాబాద్: కొత్త జిల్లాలకు స్థానిక కేడర్ల వారీగా పోస్టులు, ఉద్యోగులను కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు ఆప్షన్ల ప్రొపార్మా విడుదల చేసింది. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ మొదలు పెట్టింది. ఎస్‌సి, ఎస్‌టి కులాకు రోస్టర్ విధానం అమలు చేస్తోంది. ఉద్యోగుల సీనియారిటీ నష్టపోకుండా విధివిధానాలు రూపొందించింది. భార్యాభర్తలు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇచ్చింది. ఏ జిల్లా ఉద్యోగిని ఆ జిల్లాలోనే సర్దుబాటు చేయనున్నారు. ఉద్యోగులందరికీ కేడర్ల వారీగా అప్షన్స్ ఇవ్వనుంది. ఉద్యోగుల విభజన ప్రక్రియ రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. జిల్లా క్యాడర్ పోస్టుల కోసం ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఆయా శాఖాధిపతులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
- Advertisement -