Sunday, January 19, 2025

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ పి. న‌ర్సారెడ్డి మృతిపట్ల అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ పి. న‌ర్సారెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం

హైదరాబాద్: మాజీ పిసిసి అధ్య‌క్షుడు, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు, మాజీ మంత్రి పి న‌ర్సారెడ్డి మ‌ర‌ణం ప‌ట్ల మాజీ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సంతాపాన్ని తెలిపారు. విలువలు కలిగిన రాజకీయ నాయకుడిగా, సుపరిపాలనా దక్షుడిగా అందరి మన్ననలు పొందారని గుర్తు చేశారు. ఆయన రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు. సుదీర్గ రాజ‌కీయ జీవితంలో ఎన్నో ప‌ద‌వులు అలంక‌రించిన న‌ర్సారెడ్డి మృతి తెలంగాణ రాష్టానికి, ముఖ్యంగా నిర్మ‌ల్ జిల్లాకు తీర‌ని లోటన్నారు. నిర్మ‌ల్ ప్రాంత వాసిగా ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశార‌ని ఆయ‌న చేసిన‌ సేవ‌ల‌ను కొనియాడారు. న‌ర్సారెడ్డితో ఉన్న అనుబంధాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్నారు. అధికారిక లాంఛ‌నాల‌తో న‌ర్సారెడ్డి అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News