Wednesday, January 22, 2025

వార్ధా నదిపై బ్యారేజ్ నిర్మాణం: స్థలాన్ని పరిశీలించిన మంత్రి అల్లోల

- Advertisement -
- Advertisement -

కొమురంభీం అసిఫాబాద్: జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటల మండలం వీర్ధండి వద్ద వార్ధా నదిపై బ్యారేజ్ నిర్మాణం కొసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం సిఎంవో సెక్రెటరీ స్మితా సబర్వాల్ లతో కలిసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వార్ధా నదిని క్షేత్రస్థాయి సందర్శన చేసి స్థల పరిశీలన చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం కొసం అనువైనా ప్రదేశం ఉందని, ప్రాజెక్టు నిర్మాణంతో నియోజకవర్గ రైతులకు ఎంతో లాభదాయకమని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు చెప్పటిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్మన్ కోవాలక్ష్మి బెల్లంపల్లి, ఆడిఫాబాద్ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కుఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

Allola Indrakaran Reddy inspects at Wardha River

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News