Saturday, December 21, 2024

దోస్త్ థర్డ్ ఫేజ్ సీట్లు కేటాయింపు

- Advertisement -
- Advertisement -
సెల్ప్ రిపోర్టింగ్‌కు ఈనెల 25వ తేదీ వరకు గడువు

హైదరాబాద్ :  రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం దోస్త్ ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతున్న విషయం తెలిసిందే. దోస్త్ థర్డ్ ఫేజ్ సీట్లను ఉన్నత విద్యామండలి గురువారం కేటాయించింది. థర్డ్ ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా తమ సీటును నిర్ధారించుకోవాలి.

ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌లో ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా తమ సీట్లను ధృవీకరించుకున్న విద్యార్థులు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు తమ తమ కాలేజీల్లో సీసీఓటీపీని సమర్పించి సీట్లను ధృవీకరించుకోవాలని అధికారులు సూచించారు. థర్డ్ ఫేజ్ లో 72,949 మంది విద్యార్థుల సీట్లు పొందారు. ఆరట్స్ గ్రూపుల్లో 10,939 మంది, కామర్స్ గ్రూపుల్లో 32,209, లైఫ్ సైన్సెస్ గ్రూపుల్లో 16,859, ఫిజికల్ సైన్స్ గ్రూపుల్లో 12,620, డీ ఫార్మసీలో 235 మంది సీట్లు పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News