Sunday, December 22, 2024

నేడు లేదా రేపు ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భాగంగా శుక్రవారం లేదా శనివారం మొదటి విడత సీట్లు కేటాయింపు జరుగనున్నది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19వ తేదీన మొదటి విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయించాల్సి ఉంది. అయితే రెండు రోజులపాటు వెబ్ ఆప్షన్ల నమోదు గడువు పొడిగించిన నేపథ్యంలో సీట్ల కేటాయింపు ఒకటి రెండు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎప్‌సెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో 1,84,424 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 99,170 మంది విద్యార్థులు ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారు. వారిలో ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా మొత్తం 95,383 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అందులో ఒక విద్యార్థి అత్యధికంగా 1,051 ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారు.

కన్వీనర్ కోటా సీట్లు 72,741
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కన్వీనర్ కోటా సీట్లు ఈసారి 72,741 ఉన్నాయి. ముందుగా కన్వీనర్ కోటాలో 70,307 ఇంజనీరింగ్ సీట్లకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇవ్వగా,ఇటీవల అందుబాటులోకి వచ్చిన సీట్లతో కన్వీనర్ కోటా సీట్లు 72,741కు పెరిగాయి. ఈ విద్యాసంవత్సరం జెఎన్‌టియుహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ వర్సిటీతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీలలో మొత్తం 1,01,661 సీట్లు అందుబాటులో ఉండగా, 70 శాతం కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ సీట్లలో అత్యధికంగా సిఎస్‌ఈలో 22,943.. సిఎస్‌ఇ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్)లో 11,574 సీట్లు ఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్‌లో 1365 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో 606 సీట్లు, సిఎస్‌ఇ(సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ)లో 126 సిఎస్‌ఇ(సైబర్ సెక్యూరిటీ)లో 1,344 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News