Saturday, November 23, 2024

గృహ లక్ష్మి పథకం కింద మండలాలకు ఇళ్ల కేటాయింపు

- Advertisement -
- Advertisement -

మర్కుక్: గృహ లక్ష్మి పథకం కింద మండలాలకు ఇళ్లు మంజూరు కాగా ఆ ఇళ్ల నిర్మాణం కోసం అధికారులు, ప్రజాప్రతినిదులతో కలసి ఎంపిక చేయడం జరుగుతుందని రైతుబంధు సమితి రాష్ట్ర సభ్యులు దేవి రవీందర్ అన్నారు. శుక్రవారం గజ్వేల్‌లో సిఎం మీని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు సహాకారంతో గజ్వేల్ నియోజక వర్గంలో ఇల్లు లేని నిరుపేదలకు గృహ లక్ష్మి పథకం కింద ఇళ్లను మంజూరు చేయుటకు గతంలోనే మంత్రి హరీశ్‌రావు, గజ్వేల్ స్పెషల్ ఆఫీసర్ ముత్యంరెడ్డికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. మంత్రి అదేశాలనుసారం గజ్వేల్ నియోజక వర్గంలో పదివేల ఇళ్ల కోసం గతంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేసి గడ స్పెషల్ ఆఫీసర్ ప్రతిపాదనలు పంపించారని తెలిపారు. బిసి బంధు కింద ఆన్‌లైన్ ద్వారా ఆప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి లక్ష రూపాయలు అంధించేలా సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నవాజ్, కొండపాక గజ్వేల్ మర్కుక్ మండల పార్టీ అధ్యక్షుడు బెండ మదు,కర్ణాకర్ రెడ్డి, నూనెకుమార్, కొండపాక రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ దుర్గయ్య, మర్కుక్ ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు కృష్ణ యాదవ్, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు కళ్యాణాకర్, నర్సింగరావు, గుంటుక రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News