శేరిలింగంపల్లిలోని కమ్మ, వెలమ,
విశ్వబలిజ, కాపు సంఘాలకు
కేటాయించిన భూములపై
హైకోర్టు ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కమ్యూనిటీ భవనాలకు భూకేటాయింపులు జరపడంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో కమ్మ, వెలమ, విశ్వబలిజ కాపు సంఘాలకు కేటాయించిన భూముల్లో ఇకపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హైకోర్టు మధ్యంతర ఉ త్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఇప్పటికే నిర్మాణాలు చేపట్టి ఉన్నట్లయితే అవి తుది తీర్పునకు లోబడి ఉంటాయని గతంలోనే ఉత్తర్వులున్నాయనీ, వీటితో పాటు ఇకపై ఎలాంటి నిర్మాణా లు చేపట్టారాదని వెలమ, కమ్మ, విశ్వబలిజ కా పు సంఘాలకు ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ లో కమ్మ, వెలమ సంఘాల కమ్యూనిటీ భవనాలకు ఐదెకరాలు, విశ్వ బలిజ కాపు సంఘం క మ్యూనిటీ భవనానికి ఆరెకరాలకు పైగా భూ మిని కేటాయిస్తూ ప్రభుత్వం వేర్వేరు జీవోలు జారీ చేసింది. ఈ జీవోలపై రిటైర్డ్ ప్రొఫెసర్ వి నాయక్‌రెడ్డి, న్యాయవాది సుంకర నరేష్ వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చే శారు. దీనిపై తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుక యారాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.