Friday, January 24, 2025

ఈ ఎంఆర్‌ఒ మాములోడు కాదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: ఎట్టకేలకు కె ఎల్ యూనివర్సిటీకి భూ కేటాయింపు నిర్ణయంపై రెవెన్యూ అధికారులు వెనక్కి తగ్గారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామా రం సర్వేనెంబర్ 354లో 15ఎకరాల 30 గుం టల భూమి ప్రభుత్వం పేరిట రికార్డు అ యి ఉంది. ఇందులో ఐదెకరాల భూమిని కెఎ ల్ యూనివర్సిటీకి ఎక్సేంజ్ రూపంలో ఇ వ్వాల్సిందిగా యూనివర్సిటీ వారు అర్జీ పెట్టుకున్నారు.ఇందుకుబదులుగా సర్వేనెంబర్ 410, 411, 412, 413, 427, 428 లలో కెఎల్ యూనివర్సిటీకు ఉన్న భూమిని ప్రభు త్వం తీసుకొని 354 సర్వేనెంబర్‌లో ఉన్న భూమిని తమకు కేటాయించాలని కోరగా ఆగమేఘాల మీద కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో రెహమాన్ యూనివర్సిటీకి అనుకూలంగా రిపోర్టును త యారు చేసి ఉన్నతాధికారులకు నివేదించారు.

ఈ విషయాన్ని పలు పత్రికలు బట్టబయలు చేసి అవినీతి భాగోతం బయట పెట్టాయి. గాజులరామారంలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి అక్రమ కేటాయింపు విషయం రెవెన్యూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. అదేవిధంగా బిజెపి, ఎస్‌ఎఫ్‌ఐ, సిపిఐ ప్రతినిధులు ఈ విషయంపై ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అప్పటివరకు యూనివర్సిటీకి అనుకూలంగా వ్యవహరించిన కొంత మంది అధికారులు 354 సర్వేనెంబర్ ప్రభుత్వ భూమి కేటాయింపుపై వెనక్కి తగ్గారు. మొత్తంగా కెఎల్ యూనివర్సిటీ భూ ఎక్స్చేంజ్ పేరిట జరిపిన వ్యవహారం ప్రస్తుతానికి నిలిచిపోయింది.

‘అయితే ఓఆర్ సీ ఇవ్వకుండానే కెఎల్ యూనివర్సిటీ ఇనాం భూములు కొనుగోలు చేసిన వ్యవహారంపై బాధితులు పోరాడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ మెజిస్ట్రేట్ కార్యాలయంలో కేసు విచారణలో ఉంది. సర్వే నెంబర్ 429, 430, 431, 432 బై ఒకటి, 432, 441, 442లో కొంతమేర ఇనాం భూములు ఉన్నట్లుగా 2022 డిసెంబర్ నెలలో రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు. ఆయా సర్వే నెంబర్లలో 11 ఎకరాల వరకు ఇనాం భూములను కేఎల్ యూనివర్సిటీ ఆధీనంలో ఉంచుకుందని, ఇప్పటికే కొన్నింటిని అక్రమంగా మ్యుటేషన్ చేయించుకుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ మ్యుటేషన్ వ్యవహారంలో కూడా రెవెన్యూ అధికారులు కేఎల్ యూనివర్సిటీకి పూర్తి సహకారం అందించడంతో ఓఆర్‌సి లేకుండా అన్ని మ్యుటేషన్లు జరిగిపోయాయని బాధితులు ఆరోపించారు.

ఎంఆర్‌ఒ ఇవ్వాలని ఆర్‌డిఒ ఇవ్వాలేమని నివేదిక నిలిపివేత
కేఏల్ యూనివర్సిటీ మీద ప్రేమతో ఎమ్మార్వో రెహమాన్ వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ యూనివర్సిటీకి భూమి ఇవ్వాలని ఒక నివేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు పంపాడు. ఆ నివేదికను పరిశీలించిన మల్కాజిగిరి ఆర్‌డిఒ నివేదిక పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఈ నివేదిక ఇలా కాకుండా మరోసారి చూసి పంపించాలని పలు సూచనలు చేసే నివేదికను వెనక్కి పంపాడు. ఈ విషయం పలు పత్రికల్లో కథనాలుగా వచ్చాయి.

ఎమ్మార్వో సెలవులు బదిలీ కోసమేనా
గాజుల రామారం ప్రభుత్వ భూమి ప్రైవేట్ యూనివర్సిటీకి ధారాదత్తం చేసేందుకు కొంతమంది అధికారులు ప్రయత్నం చేస్తున్నారని సమాచారం బయటకు రావటంతో అప్రమత్తమైన కుత్బుల్లాపూర్ ఎమ్మార్వో ఎంపీ ఎన్నికల విధులు పూర్తయినప్పటినుండి సెలవులు పెడుతూ విధులకు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే తను సీట్లో ఉంటే మళ్లీ నివేదిక పంపాల్సి ఉంటుందని అది అనుకూలంగా పంపితే ఉన్నతాధికారుల బెడద పంపకపోతే యూనివర్సిటీ వారితో బాధ అనుకున్నాడేమో ఎమ్మార్వో మాత్రం వరుసగా సెలవులు పెట్టుకుంటూపోతూ ఈ అవినీతి బాగోతం బయటపడక ముందుకే ఇక్కడ నుండి బదిలీ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నట్లు కార్యాలయంలో గుసగుసలు వినబడుతున్నాయి. అయితే ఇన్‌చార్జ్ ఎమ్మార్వోతో కుత్బుల్లాపూర్ మండలం కార్యాలయంలో ప్రజలకు పూర్తిస్థాయి సేవలు అందడం లేదని వెంటనే ఉన్నతాధికారులు ఎవరైనా సరే పూర్తిస్థాయి ఎమ్మార్వో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News