Wednesday, January 22, 2025

కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

- Advertisement -
- Advertisement -

ఆర్థిక, విద్యుత్ శాఖ డిప్యూటీ సిఎం భట్టి
నీటి పారుదల, పౌరసరఫరాలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఐటీ శాఖ, పరిశ్రమలు దుద్దిళ్ల శ్రీదర్‌బాబు
కీలకమైన హోం, మున్సిపల్, విద్య శాఖలు సిఎం రేవంత్‌రెడ్డి వద్దే

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ క్యాబినేట్‌లో కొత్తగా కొలువుదీరిన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. శాఖల కేటాయింపు కోసం హస్తిన వెళ్లిన ఆయన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియా, రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్‌లతో చర్చలు జరిపినంతరం శనివారం మంత్రులకు శాఖలు కేటాయించారు. కీలకమైన హోంశాఖ, సాధారణ పరిపాలన,మున్సిపల్, విద్య, ఎస్సీ, ఎస్టీ శాఖలతో పాటు కేటాయించని శాఖలు తనవద్దే ఉంచుకున్నారు. 11 మంది మంత్రులకు వివిధ శాఖలు అప్పగించారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు ఆర్ధిక, విద్యుత్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నీటిపారుదల, పౌరసరఫరాలు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఎంపిక చేశారు.

డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క : ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ
ఉత్తమ్ కుమార్ రెడ్డి : నీటి పారుదల, పౌరసరఫరాలు
దామోదర రాజనర్సింహ : వైద్యం, ఆరోగ్య ,కుటుంబ సంక్షేమ శాఖ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి : రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ
దుద్దిళ్ల శ్రీధర్ బాబు : ఐటీ, శాసన సభా వ్యవహారాలు, పరిశ్రమలు
పొంగులేటి :  రెవెన్యూ, గృహనిర్మాణం, ఐ అండ్ పిఆర్,
పొన్నం ప్రభాకర్ రావు : రవాణా శాఖ, బిసి సంక్షేమం
కొండా సురేఖ : అటవీ, పర్యావరణ, దేవాదాయ
దనసూరి సీతక్క : పంచాయతీరాజ్, మాతా శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి
తుమ్మల నాగేశ్వర్ రావు : వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, టెక్స్ టైల్స్
జూపల్లి కృష్ణారావు : ఎక్సైజ్, పర్యాటక శాఖ

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News