Sunday, December 22, 2024

బెస్ట్ అవెలబుల్ స్కూళ్లలో ప్రవేశాలకు సీట్ల కేటాయింపు

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లాలో బెస్ట్ అవెలబుల్ స్కూళ్లలో ప్రవేశాలకు సీట్ల కేటాయింపును సోమవారం లాటరీ పద్దతిలో ఎంపిక చేశారు. జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు జిల్లా కలెక్టర్ ప్రియాంక సీట్ల కేటాయింపును లాటరీ ద్వారా నిర్వహించారు. జిల్లాలోని బెస్ట్ అవెలబుల్ స్కూళ్లలో ప్రవేశాలకోసం దరఖాస్తులు చేసుకున్న వారి సమక్షంలోనే లాటరీ ద్వారా ఎంపిక చేసి పారదర్శకత పాటించామని జిల్లా అదనపు కలెక్టర్ ప్రియాంక తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నాగలైశ్వర్, జిల్లా విద్యాధికారి మాధవి, టీఎస్‌డబ్లుఆర్‌ఈ ఐఎస్ జిల్లా సమన్వయాధికారి మంజుల, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సాయిరాం, సూర వెంకటేశం, ఎస్సీ సంఘం ప్రతినిధి కొంకటి లింగమూర్తితోపాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News